Delhi: పొగమంచు ఎఫెక్ట్.. వందకు పైగా విమానసర్వీసులు ఆలస్యం

by Shamantha N |
Delhi: పొగమంచు ఎఫెక్ట్.. వందకు పైగా విమానసర్వీసులు ఆలస్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాదిని చలి వణికిస్తోంది. ఢిల్లీ(Delhi)ని దట్టమైన పొగమంచు(dense fog) కమ్మేయడంతో ఆరు విమానాలు రద్దయ్యాయయి. అంతేకాకుండా, పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. శనివారం దాదాపు తొమ్మిది గంటల వరకు జీరో విజిబిలిటీ ఉంది. దీంతో, విమాన సర్వీసుల రాకపోకలు ఆలస్యంగా మారాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI Airport) విమానాశ్రయంలో ఆదివారం 6 విమానాలు(six flights) రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలానే, 123 విమానాలు సగటున 20 నిమిషాల ఆలస్యంగా నడుస్తున్నాయి. శనివారం 48 విమానాలు రద్దయ్యాయి. 564 విమానాలు ఆలస్యమయ్యాయి. 15 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. ఇకపోతే, ఆదివారం ఉదయం 4 నుంచి 8 గంటల వరకు జీరో విజిబిలిటీ ఉండగా.. ఆ తర్వాత విజిబిలిటీ 50 మీటర్లకు మెరుగుపడింది.

81 రైళ్లు ఆలస్యం

మరోవైపు, దట్టమైన పొగమంచు కారణంగా 81 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 59 రైళ్లు ఆరు గంటల ఆలస్యంతో, 22 రైళ్లు ఎనిమిది గంటల ఆలస్యంతో నడుస్తాయని ఉత్తర రైల్వే తెలిపింది. ఢిల్లీలో 10 డిగ్రీలకు కనిష్ఠ ఉష్ణోగ్రత పడిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం ఆదివారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 377గా నమోదైంది. చలిగాలులు వీచే అవకాశం ఉందని, దట్టమైన పొగమంచు పడనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed