Bhopal: కారులో 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల నగదు పట్టుకున్న అధికారులు

by S Gopi |
Bhopal: కారులో 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల నగదు పట్టుకున్న అధికారులు
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ కంపెనీల అవినీతిపై జరుగుతున్న దాడుల్లో అవినీతి తిమింగలాలు బయటపడుతున్నాయి. భారీ మొత్తం పన్నులను ఎగవేస్తున్న అక్రమార్కులపై అధికారులు కొరడా ఝులిపిస్తుండటంతో అవినీతిపరులు తప్పించుకునేందుకు తిప్పలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భోపాల్ సమీపంలోని అడవుల్లో పాడుబడిన ఇన్నోవా కారు నుంచి 52 కిలోల బంగారం, రూ. 9.86 కోట్ల సొమ్మును ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ అధికారికంగా ధృవీకరించారు. భోపాల్‌తో పాటు ఇండోర్ అంతటా అనేక నిర్మాణ సంస్థలపై ఈ దాడులు జరుగుతున్నాయి. దాడుల గురించి తెలుసుకున్న అవినీతిపరులు భారీ సొమ్ము, నగలతో భోపాల్ నుంచి కారులో పారిపోతున్నట్టు అధికారులకు సమాచారం అందింది. అప్రమత్తమైన ఐటీ శాఖ, పోలీసుల బృందం 100 మందితో కలిసి మెండోరి గ్రామంలో వాహనాన్ని పట్టుకున్నారు. ఇటీవల భోపాల్, ఇండోర్‌లో కార్యకలాపాలు నిర్వహించే వివిధ నిర్మాణ సంస్థలకు చెందిన 51 చోట్ల ఐటీ శాఖ దాడులు చేసింది. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా కోట్లాడి రూపాయలు ఎగవేస్తున్నట్టు ఐటీ విభాగం గుర్తించింది. రీజనల్ ట్రాన్స్ ఫోర్ట్ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేసిన సౌరభ్ శర్మ ఇల్లు, కార్యాలయం నుంచి ఇప్పటివరకు రూ.2.85 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 60 కిలోల వెండి కడ్డీలు కూడా ఉన్నాయి.

Next Story