కరోనా అలర్ట్.. కొత్తగా 4,282 COVID-19 కేసులు నమోదు

by Mahesh |
కరోనా అలర్ట్.. కొత్తగా 4,282 COVID-19 కేసులు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా పాజిటివ్ కేసుల నమోదు సంఖ్య నెమ్మది నెమ్మది తగ్గుతుంది. ఒక వారం పాటు విపరీతంగా పెరిగిన కరోనా తగ్గుతూ వస్తుంది. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,282 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటి తో పోలిస్తే..27% తక్కువ. అలాగే 24 గంటల్లో 14 మంది కరోనాతో మృతి చెందగా ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5,31,548కు చేరుకుంది. అలాగే ప్రస్తుతం భారతదేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 47,246 తగ్గింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 44,370,878కు చేరింది.

Advertisement

Next Story