400 సీట్లు గెలిస్తే పీఓకేని భారత్‌లో విలీనం చేయడమే: అస్సాం సీఎం హిమంత శర్మ

by S Gopi |
400 సీట్లు గెలిస్తే పీఓకేని భారత్‌లో విలీనం చేయడమే: అస్సాం సీఎం హిమంత శర్మ
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 కంటే ఎక్కువ సీట్లు వస్తే, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌(పీఓకే)ను భారత్‌లో విలీనం చేస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది మాత్రమే కాకుండా మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే మోడీ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. బుధవారం జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ఆయన, దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు చేసేందుకు, 'శ్రీ కృష్ణ జన్మభూమి' ఆలయం, 'జ్ఞానవాపి దేవాలయం' నిర్మించడానికి బీజేపీకి 400 కంటే ఎక్కువ సీట్లు అవసరమని అన్నారు. ఈసారి అధికారంలోకి వస్తే బాబా విశ్వనాథ ఆలయ నిర్మాణం జరుగుతుందన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 300 సీట్లు గెలిచిన బీజేపీ అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మించింది. ఈసారి 400 సీట్లు గెలిస్తే మరిన్ని కీలక నిర్ణయాలు జరుగుతాయని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు పీఓకే అంశంపై ఎన్నడూ చర్చ జరగలేదని హిమంత శర్మ విమర్శలు చేశారు.



Next Story