- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మోడీ హఠావో.. దేశ్ బచావో’.. ఢిల్లీలో పోస్టర్ల కలకలం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో వేలాది పోస్టర్లు వెలిశాయి. ఈ విషయంలో పోలీసులు 36 కేసులు నమోదు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇద్దరికి ప్రింటింగ్ ప్రెస్‌లు ఉన్నాయి. ఈ పోస్టర్ల తొలగింపును పెద్ద ఆపరేషన్‌లా భావించిన పోలీసులు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో 2000 పోస్టర్లను పట్టుకున్నారు. ఈ పోస్టర్లలోని చాలా వాటిల్లో ‘మోడీ హటావో.. దేశ్ బచావో’ (మోడీని తొలగించండి.. దేశాన్ని రక్షించండి) అనే నినాదం ఉంది.
ప్రజల ఆస్తులను నాశనం చేసినందుకు పోస్టర్లపై ఉన్న పేర్లను బట్టి ప్రింటింగ్ ప్రెస్ వాళ్లను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం 138 ఎఫ్ఐఆర్‌లను నమోదు చేశామని చెప్పారు. అందులో 36 మోడీకి వ్యతిరేక పోస్టర్లకు సంబంధించినవన్నారు. ‘అన్ని పోస్టర్లకు ప్రింటర్ పేరు తప్పనిసరిగా ఉండాలి. ఎవరైనా దానిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం మేము అదే చేస్తున్నాం. అది కొనసాగుతూనే ఉంటుంది’ అని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయంలో 2000 పోస్టర్లను పోలీసులు సీజ్ చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని ఐపీ ఎస్టేట్ ప్రాంతంలో ఈ పోస్టర్లు ఉన్న వ్యాన్‌ను పోలీసులు అడ్డగించారు. అయితే ఈ పోస్టర్లను ఆప్ ప్రధాన కార్యాలయానికి చేర్చాల్సిందిగా తనకు చెప్పారని ఆ వ్యాన్ డ్రైవర్ పోలీసులతో చెప్పాడు. ఇటువంటి పోస్టర్లనే సోమవారం కూడా డెలివరీ చేసినట్లు ఆ డ్రైవర్ తెలిపాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసేంతగా ఆ పోస్టర్లలో ఏముందని ఆమ్ ఆద్మీ పార్టీ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది. మోడీ ప్రభుత్వం నియంతృత్వ పరిపాలనకు ఇది పరాకాష్ట అని ఆప్ పేర్కొంది.
‘మోడీ హటావో, దేశ్ బచావో’ పోస్టర్లను 50 వేలు ప్రింట్ చేయాల్సిందిగా ఆర్డర్ ఇచ్చారని ప్రింటింగ్ ప్రెస్ ఓనర్లు ఢిల్లీ పోలీసులకు చెప్పారు. అయితే పోస్టర్లపై ప్రెస్ పేరు లేనందున వారిని అరెస్టు చేశారు. కేంద్రం, ఆప్ మధ్య వివాదానికి ఈ అరెస్టులు తాజా వ్యవహారంగా మారింది. పోస్టర్లు వేసేటప్పుడు ఆప్ చట్టాన్ని అనుసరించడం లేదని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దించాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది.