- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
32 ఏళ్ల కింద కల్తీ పాల విక్రయంపై ఫిర్యాదు.. కోర్టు ఇచ్చిన తీర్పు ఇదే..!
X
దిశ, వెబ్‌డెస్క్: కల్తీ పాలను విక్రయించినందుకు ఒక వ్యక్తికి కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అయితే ఈ విషయంపై ఫిర్యాదు నమోదైన 32 సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. హర్బీర్ సింగ్ అనే వ్యక్తి కల్తీ పాలను విక్రయిస్తున్నట్లు 1990 ఏప్రిల్ 21న కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ప్రశాంత్ కుమార్ గురువారం నిందితుడు హర్బీర్ సింగ్‌ను దోషిగా నిర్ధారించి.. రూ. 5,000 జరిమానా విధించారు. హర్బీర్ సింగ్ కల్తీ పాలను విక్రయిస్తున్నట్లు తేలిందని ప్రాసిక్యూషన్ అధికారి రామావతార్ సింగ్ శుక్రవారం పిటిఐకి తెలిపారు. విక్రయించిన కల్తీ పాల నమూనాను ల్యాబొరేటరీకి పంపగా.. అందులో కల్తీ ఉన్నట్టు తేలిందని ప్రాసిక్యూషన్ అధికారి వెల్లడించారు.
Advertisement
Next Story