ఆసక్తికర పరిణామం.. లొంగిపోయిన 30 మంది మావోయిస్టులు

by GSrikanth |
ఆసక్తికర పరిణామం.. లొంగిపోయిన 30 మంది మావోయిస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ దేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఒకేసారి 30 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో చోటుచేసుకుంది. సీఆర్‌పీఎఫ్ డీఐజీ అండ్ బీజాపూర్ ఎస్పీ సమక్షంలో మంగళవారం లొంగిపోయారు. కాగా, ఈ మధ్య కాలంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య తరచూ ఎదురుకాల్పులు చోటుచేసుకుంటున్నాయి. రోజూ ఎక్కడో చోట పలువురు భద్రతా బలగాలు, మావోయిస్టులు మృతిచెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు కూడా భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 10 మంది వరకు మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. ఇలాంటి తరుణంలో ఒకేసారి 30 మంది మావోయిస్టులు లొంగిపోవడం చర్చనీయాంశమయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story