J&K Encounter: ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతం

by Shamantha N |
J&K Encounter: ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతం
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బుధవారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో కనీసం ముగ్గురు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు. కుప్వారా జిల్లాలోని తంగ్ ధర్ సెక్టార్ లో, మచిల్ సెక్టార్ లో ఎదురుకాల్పులు జరిగాయి. తంగ్ ధర్ సెక్టార్‌లో బుధవారం రాత్రి టెర్రరిస్టుల కదలికలు కనిపించడంతో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఇద్దరు నుంచి ముగ్గురు ముష్కరుల కదలికలు కన్పించడంతో మచిల్ సెక్టార్‌లో 57 రాష్ట్రీయ రైఫిల్స్ (RR) దళం అప్రమత్తమై ఆపరేషన్ చేపట్టింది. ఈ రెండు ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు టెర్రరిస్టులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు, రాజౌరీ జిల్లాలోని లాఠీ గ్రామంలో మూడో ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. అక్కడ నలుగురు ముష్కరులు దాక్కున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

మూడు ఎన్ కౌంటర్లు

బుధవారం రాత్రి 7.40 గంటలకు చొరబడిన ఉగ్రవాదుల కదలికలను గుర్తించామని కుప్వారా జిల్లా అధికారులు తెలిపారు. దీంతో, ఎన్ కౌంటర్ ప్రారంభించామన్నారు. ఉగ్రకదలికలు గుర్తించిన తర్వాత బుధవారం రాత్రి 9.30 గంటలకు రాజౌరి జిల్లాలోని ఖేరీ మోహ్రా లాఠీ, దంతాల్ గ్రామంలో భద్రతా దళాలు సెర్ట్ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో బుధవారం రాత్రి 11.45 గంటలకు ఎన్ కౌంటర్ ప్రారంభమైందని తెలిపారు. అదనపు బలగాలను ఆ ప్రాంతానికి తరలించినట్లు వారు తెలిపారు. ఇకపోతే, జమ్ము కశ్మీర్ లో సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 1 వరకు మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో, ఆప్రాంతంలో అధికారులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed