- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rhea Chakraborty: ప్రియుడి మృతి కేసులో హీరోయిన్‌కు ఊరట..
దిశ, సినిమా: బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) 2020 జూన్ 14న మరణించిన సంగతి తెలిసిందే. ముంబయి (Mumbai)లోని తన ఇంట్లో అనుమానాస్పద (suspicious) స్థితిలో కనిపించడంతో.. అతడిది ఆత్మహత్య కాదని ఆయన కుటుంబసభ్యులు నటి రియా చక్రవర్తి (Ria Chakraborty), ఆమె ఫ్యామిలీపై కేసు పెట్టారు. అప్పటి నుంచి విచారణ జరుగుతున్న ఈ కేసులో నటి రియా చక్రవర్తికి తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. రియాతో పాటు ఆమె ఫ్యామిలీపై ఉన్న లుక్అవుట్ సర్క్యూలర్ (ఎల్ఓసీ)ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు (Bombay High Court) ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
కాగా.. ఈ కేసులో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రియా, ఆమె తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, సోదరుడు షోవిక్ చక్రవర్తి విదేశాలకు వెళ్లకుండా సీబీఐ గతంలో ఎల్ఓసీ జారీ చేసింది. దీనిపై రియా బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు దానిని రద్దు చేసింది. అయితే.. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే వాదోపవాదాలు విన్న సుప్రీం కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ.. బాంబే హైకోర్టు తీర్పును సమర్థించింది.