టూ వీలర్ ట్యాక్సీలు బంద్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

by Javid Pasha |   ( Updated:2023-06-12 10:16:13.0  )
టూ వీలర్ ట్యాక్సీలు బంద్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో టూ వీలర్ ట్యాక్సీ సర్వీసులను బంద్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అయితే తమ ఆదేశాలు జూన్ 30 వరకు అమలులో ఉంటాయని, ఈ లోగా ర్యాపిడో, ఊబర్ వంటి టూ వీలర్ ట్యాక్సీల సర్వీసులకు సంబంధించిన సమగ్ర పాలసీని తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా అంతకుముందు ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నారని టీ వీలర్ ట్యాక్సీలను హెచ్చరిస్తూ ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇక ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన నోటీసులపై ర్యాపిడో సంస్థ కోర్టులో సవాలు చేసింది. రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులను కాలరాసేలా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో టూ వీలర్ ట్యాక్సీ సర్వీసులను రద్దు చేస్తూ తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు రావడం గమనార్హం.

Advertisement

Next Story