రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు

by sudharani |   ( Updated:2022-11-26 10:04:59.0  )
రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
X

గాంధీనగర్: గుజరాత్‌లో మరో ఐదు రోజుల్లో తొలి దశ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ మ్యానిఫెస్టో సంకల్ప్ పాత్ర‌ను విడుదల చేసింది. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొంది. అంతేకాకుండా బాలికలకు ఉచిత విద్య అందిస్తామని తెలిపింది. శనివారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేతుల మీదుగా పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జేపీ నడ్డా మాట్లాడుతూ.. 'మేము బెదిరింపులను, ఉగ్రవాద సంస్థలు, భారత వ్యతిరేక శక్తుల స్లీపర్ సెల్‌లను గుర్తించి తొలగించడానికి యాంటీ-రాడికలైజేషన్ సెల్‌ను రూపొందిస్తాము. గుజరాత్‌లో యూనిఫాం సివిల్ కోడ్ కమిటీ సిఫార్సును పూర్తిగా అమలు చేసేలా చూస్తాము' అని అన్నారు.

గుజరాత్ పురోగతి కోసం, రాష్ట్రాన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడం ద్వారా గుజరాత్ ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థతో సమానంగా మారుస్తామని పేర్కొన్నారు. మ్యానిఫేస్టోలో పేర్కొన్న కీలక హామీలు ఇవే.. రైతులకు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు రూ.10,000 కోట్ల కేటాయింపులు. వ్యవసాయ మౌళిక సదుపాయాలకు రూ.25,000 కోట్లు. యాంటీ-రాడికలైజేషన్ సెల్ ఏర్పాటు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటు మహిళలకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కల్పిస్తాం. సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్సు ప్రయాణం. బాలికలకు కేజీ టూ పీజీ ఉచిత విద్యతో పాటు ఇతర కీలక హామీలను మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. ప్రధాని మోడీ దిశానిర్దేశంలో అభివృద్దికి కట్టుబడి ఉంటామని సీఎం భూపేంద్ర పటేల్ అన్నారు. కాగా, 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ లో తొలి దశ 1, రెండో దశ 5న జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed