- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
20 మంది బీజేపీ ముఖ్య నేతలకు కేబినేట్ లో దక్కని చోటు..!
దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్రమోడీ సహా 72 మందితో కొత్త మంత్రివర్గం ఏర్పాటయ్యింది. కాగా.. గతసారి కేంద్రమంత్రులుగా పనిచేసిన 20 మంది బీజేపీ నాయకులకు ఈసారి షాక్ తగిలింది. ఎన్నికల్లో గెలిచినప్పటికీ ముగ్గురు ముఖ్యనేతలు అనురాగ్ ఠాకూర్, నారాయణ్ రాణే, అజయ్ భట్ లకు ఈసారి కేబినేట్ లో చోటు దక్కలేదు. గతఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతి ఇరానీ ఈసారి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. దీంతో, ఆమెకు మంత్రిమండలిలో స్థానం లభించలేదు.
ఓటమిపాలైన నేతలు
మరోవైపు ఈసారి ఎన్నికల్లో సాధ్వి నిరంజన్ జ్యోతి, ఆర్కే సింగ్, అర్జున్ ముండా, రాజీవ్ చంద్రశేఖర్ ఓటమి పాలయ్యారు. దీంతో, వారికి కూడా మంత్రిమండలిలో చోటు దక్కలేదు. ఎన్నికల్లో పోటీ చేసిననిసిత్ ప్రమాణిక్, అజయ్ మిశ్రా తేని, సుభాస్ సర్కార్, భారతీ పవార్, రావుసాహెబ్ దాన్వే, కపిల్ పాటిల్ కూడా దారుణంగా ఓడిపోయారు. ఇక, వారికి కూడా కేబినేట్ బెర్త్ దక్కలేదనే చెప్పుకోవచ్చు. మరోవైపు, బీజేపీ సీనియర్ నేతలు మీనాక్షిలేఖి, జనరల్ వీకే సింగ్, అశ్వినీ కుమార్ చౌబే అసలు ఎన్నికల్లో పోటీ చేయనే లేదు. దీంతో, కేంద్రమంత్రి పదవి అనే అంశం తెరపైకి వచ్చే ఛాన్సే లేదు. భగవత్ కరద్, జాన్ బార్లాకూ కూడా ఈసారి మొండిచెయ్యి దక్కింది.