- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: ఇండియాలో ట్విట్టర్ ఆఫీసులు బంద్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లో ఉన్న తమ మూడు ఆఫీసుల్లో రెండింటిని మూసివేస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలో ఉన్న ట్విట్టర్ ఆఫీస్‌లను షట్ డౌన్ చేస్తున్నట్లు తెలిపారు. కేవలం బెంగళూర్‌లోని ట్విట్టర్ కార్యాలయాన్ని మాత్రమే కొనసాగిస్తున్నట్లు ప్రకటన చేశారు. మూసేసిన రెండు కార్యాలయాల్లోని ఉద్యోగులను ఇంటి నుండి పని చేయాలని సూచించారు. కాగా, ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక, ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు టెస్లా అధినేత ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ట్విట్టర్‌ను హ్యాండోవర్ చేసుకున్న నాటి నుండి మస్క్ సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. డబ్బులకు బ్లూ టిక్ ఇవ్వడం.. ఇలా తనదైన శైలీలో మస్క్ ప్రయోగాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే, తాజాగా మస్క్ ట్విట్టర్ సీఈఓ సీట్లో తన పెంపుడు కుక్కను కూర్చొబెట్టి.. పాత సీఈవోల కంటే ఇదే బెటర్ అనే చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.