రామ్‌లల్లా దర్శనానికి కాలినడన 150 కి.మీ ప్రయాణం.. మత సామరస్యాన్ని చాటిన ముస్లింలు

by Shiva |
రామ్‌లల్లా దర్శనానికి కాలినడన 150 కి.మీ ప్రయాణం.. మత సామరస్యాన్ని చాటిన ముస్లింలు
X

దిశ, వెబ్‌డెస్క్: 500 ఏళ్ల నాటి హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం వైభవోపేతంగా జరిగింది. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా వేద మంత్రాల నడుమ, శ్రీరామ నామ పరాయణంతో అద్యంతం ఉత్సాహంగా కొనసాగింది. దేశంలోని ప్రజలు కుల, మత విబేధాలు లేకుండా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించి బాల రాముడి కృపకు పాత్రులయ్యారు. బాల రాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన తరువాత దేశంలోని నలుమూలల నుంచి భక్తుల స్వామి వారిని దర్శించుకోవాడానికి అయోధ్యకు చేరుకుంటున్నారు.

500 ఏళ్ల హిందువుల కల సాకారమైన వేళ చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రామ్ లల్లాను ఆరాధిస్తున్నారు. ఈ క్రమంలోనే లక్నోకు చెందిన దాదాపు 350 మంది ముస్లింలు రాముల వారి దర్శనానికి బయలుదేరారు. సుమారు ఆరు రోజుల పాటు ప్రతిరోజూ 25 కి.మీ చొప్పన కాలి నడకన సుమారు 150 కి.మీ ప్రయాణించి అయోధ్యకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా రామ్ లల్లాను దర్శనం అనంతరం వారు మాట్లాడుతూ.. రాముడు అందరికీ పూర్వికుడని అన్నారు. రామ్, రహీమ్ ఒక్కడేనంటూ వారు మత సామరస్యాన్ని చాటారు.

Advertisement

Next Story