Kerala: నిఫా వైరస్ తో పద్నాలుగేళ్ల బాలుడు మృతి

by Shamantha N |
Kerala: నిఫా వైరస్ తో పద్నాలుగేళ్ల బాలుడు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళ(Kerala)ను నిఫా వైరస్‌ (Nipah Virus) కలవరపెడుతోంది. కాగా.. నిఫా వైరస్ సోకిన 14 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఈ విషయాన్ని కేరళ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ ఆదివారం వెల్లడించారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మరణించినట్లు తెలిపారు. బాలుడికి వెంటిలేటర్ పైన ట్రీట్మెంట్ అందించారని పేర్కొన్నారు. కాగా, ఆదివారం ఉదయం బాలుడికి యూరిన్ ఔట్ పుట్ తగ్గిపోయిందని.. కాసేపటికే తీవ్ర గుండెపోటుతో చనిపోయినట్లు తెలిపారు. అతడ్ని బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్‌ మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

వైరస్ సోకిన కొన్నిగంటలకే..

అయితే, బాలుడికి వైరస్ సోకినట్లు శనివారం తెలిసింది. వైరస్ సోకిన కొన్ని గంటలకే బాలుడు మరణించడం గమనార్హం. మళప్పురం(Malappuram) జిల్లాలో 14 ఏళ్ల బాలుడికి నిఫా వైరస్‌ సోకినట్లు వీణా జార్జ్‌ శనివారమే తెలిపారు. కాగ.. పూణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (NIV) దీన్ని ధ్రువీకరించినట్లు తెలిపారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు తెలిపారు. బాలుడ్ని కోజికోడ్‌లోని(Kozhikode) ప్రభుత్వ హాస్పిటల్ కు తరలిస్తామని పేర్కొన్నారు. అతడికి కాంటాక్ట్ లో ఎవరెవరు ఉన్నారో తెలియాల్సి ఉందన్నారు. కాగా.. ఈలోనే బాలుడు చనిపోయాడు.

Advertisement

Next Story

Most Viewed