- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Indian fishermen: 14 మంది భారతీయ జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ
దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన 14 మంది మత్స్యకారులను గురువారం తెల్లవారుజామున శ్రీలంక నావికాదళం అరెస్ట్ చేసింది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (ఐఎంబీఎల్) దాటి, అవతల చేపలు పట్టినందుకు గానూ వారిని అదుపులోకి తీసుకున్నట్టు శ్రీలంక నేవీ అధికారులు తెలిపారు. ఒక్కో బోటులో ఏడుగురితో సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు చేపలు పట్టి గురువారం రామేశ్వరం తిరిగి రావాల్సి ఉండగా శ్రీలంక నావికాదళం అరెస్టు చేసి మన్నార్‌కు తరలించారు. వారు ప్రయాణించిన ఫిషింగ్ ట్రాలర్‌లను స్వాధీనం చేసుకున్నారు. రామేశ్వరంలోని తంగచిమడమ్‌కు చెందిన మైఖేల్ రాజ్, నిజోకు చెందిన ట్రాలర్‌లు ఉత్తర శ్రీలంకలోని డెల్ఫ్ట్ ద్వీపం (నెడుంతీవు)లో చేపలు పట్టినట్లు శ్రీలంక అధికారులు తెలిపారు. నెడుంతీవు అనేది ఉత్తర శ్రీలంకలోని ఒక ద్వీపం, దాని చుట్టూ లోతులేని జలాలు, ఇసుక బీచ్‌లు ఉన్నాయి. మంగళవారం సాయంత్రం రామేశ్వరం ఫిషింగ్ జెట్టీ నుంచి బయలుదేరిన 450 నౌకలతో కలిసి ఈ బోట్లు సముద్రంలోకి వెళ్లాయి. ఈ ఏడాది జూన్ నుంచి చేపల వేటపై నిషేధం ముగిసినప్పటి నుంచి భారత జాలర్లను శ్రీలంక అరెస్టు చేసిన ఘటనలు పెరిగాయి. ఇప్పటివరకు తమిళనాడుకు చెందిన 250 మంది మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసి, 30 బోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.