DR Congo: దారుణం.. 129 మంది ఖైదీలు మృతి

by Shamantha N |
DR Congo: దారుణం.. 129 మంది ఖైదీలు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో(DR Congo)లోని సెంట్రల్‌ మకాల జైలులో దారుణం జరిగింది. సుమారు 129 మంది ఖైదీలు చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వారంతా జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే ఇలా జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ఇంటీరియర్‌ మంత్రి షబాని లుకో మంగళవారం ఎక్స్‌లో వెల్లడించారు. వీరిలో 59 మంది గాయపడినట్లు వెల్లడించారు. “మకాలా సెంట్రల్ జైలులో నుంచి సామూహికంగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గార్డులు అప్రమత్తమై రంగంలోకి దిగడంతో తొక్కిసలాట జరిగింది. కిచెన్‌లో మంటలు చెలరేగాయి. మంటల్లో పడి మొత్తం 129 మంది మరణించారు. మరో 59 మంది తీవ్రంగా గాయపడ్డారు. అడ్మినిస్ట్రేటివ్‌ భవనం కూడా దెబ్బతింది’’ అని మంత్రి షబాని లుకో పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

అధికారులు ఏమన్నారింటే?

జైలు అధికారులు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఖైదీలు ఎవరూ తప్పించుకోలేదని.. తప్పించుకొనేందుకు ప్రయత్నించినవారంతా చనిపోయారని తెలిపారు. ఈఘటనపై విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. ఇక, ఖైదీల వాదన మాత్రం మరోలా ఉంది. తమకు బయట నుంచి భారీ కాల్పుల చప్పుళ్లు వినిపించాయని పేర్కొన్నట్లు సదరు సంస్థ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed