హజ్ యాత్రలో 1000 మందికిపైగా మృతి.. భారతీయులు ఎంతమంది ?

by Hajipasha |
హజ్ యాత్రలో 1000 మందికిపైగా మృతి.. భారతీయులు ఎంతమంది ?
X

దిశ, నేషనల్ బ్యూరో : సౌదీ అరేబియాలోని మక్కాలో హజ్‌యాత్ర సందర్భంగా వడదెబ్బతో చనిపోయిన హజ్ యాత్రికుల సంఖ్య 1000 దాటిందంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వీరంతా 10 దేశాలకు చెందినవారని ఆ కథనాల్లో పేర్కొన్నారు. చనిపోయిన వారిలో దాదాపు 658 మంది ఈజిప్టు దేశస్తులేనని తెలిపారు. వీరిలో 630 మంది అనుమతి లేకుండా అక్రమంగా మక్కా నగరానికి వచ్చారని వెల్లడించారు. హజ్ యాత్ర అనుమతి కోసం భారీగా ఖర్చు అవుతుండటంతో చాలామంది అక్రమ మార్గాల్లో మక్కాకు చేరుకుంటున్నారు. ఇలా వచ్చే వేల మందిని స్థానిక అధికారులు నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. వారి సంఖ్య ఎక్కువగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. యాత్ర ముగిసిన తర్వాత.. రిజిస్టర్‌ చేసుకున్న వారికే అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక ఏసీ షెల్టర్లలో బస చేసేందుకు అనుమతి ఉంటుంది. అందుకే మరణిస్తున్న వారిలో రిజిస్టర్‌ చేసుకోని వారే అధికంగా ఉన్నారని అధికార వర్గాలు చెప్పాయి.

భారత్, జోర్డాన్..

భారత్ నుంచి హజ్ యాత్ర కోసం వెళ్లిన 90 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు. జోర్డాన్ దేశానికి చెందిన 60 మందికిపైగా చనిపోయారని సమాచారం. పాకిస్థాన్‌, ఇండోనేషియా, ఇరాన్‌, సెనెగల్‌, ట్యూనిషియా, అల్జీరియా దేశస్తులు కూడా పెద్దసంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. అయితే ఏయే దేశాలకు చెందిన ఎంతమంది హజ్ యాత్రికులు చనిపోయారనే దానిపై పూర్తి క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ అంశంపై స్పందించలేదు.

Advertisement

Next Story

Most Viewed