- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Delhi: పాఠశాలకు తుపాకీ తీసుకెళ్లిన పదేళ్ల బాలుడు
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని ప్రైవేట్ స్కూల్ కి పదేళ్ల బాలుడు తుపాకి తీసుకురావడం కలకలం సృష్టించింది. గన్ తీసుకురావడంతో తీసుకురావడంతో తోటి విద్యార్థులు భయపడిపోయారు. ఉపాధ్యాయులకు ఈ విషయం చెప్పగా వారు ఆ ఆరోతరగతి విద్యార్థి నుంచి గన్ ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో, పోలీసులు కుటుంబసభ్యలను ప్రశ్నించారు. ఆ గన్ చిన్నారి తండ్రిదని.. అతడు ఇటీవలే చనిపోయాడని వెల్లడించారు. తుపాకీకి లైసెన్స్ ఉందని బాలుడి తల్లి అధికారులకు వెల్లడించింది. పిస్టల్ ను పోలీస్ స్టేషన్ లో జప్తు చేయల్సింది పోయి.. తన దగ్గరే ఉంచుకున్నట్లు తెలిపింది. అయితే, గన్ ని బొమ్మ తుపాకీగా భావించి స్కూల్ కి తీసుకువచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు లైసెన్సును రద్దు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. దీనిపై, విచారణ జరుపుతున్నామన్నారు.
పోలీసుల సూచనలు
కాగా ఇటీవల విద్యార్థులు పాఠశాలలకు తుపాకులను తీసుకువస్తున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో, బిహార్ లో స్కూల్ కు చిన్నారులు తుపాకులు తీసుకొచ్చిన ఘటనలే జరిగాయి. అయితే, ఇలాంటి ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని అధికారులు సూచించారు. ప్రమాదకరమైన వస్తువులు పిల్లలకు అందుబాటులో ఉంచకూడదని హెచ్చరించారు. స్కూల్‌కు వెళ్లే సమయంలో, ఇంటికి వచ్చిన తర్వాత వారి బ్యాగ్‌లను చెక్ చేస్తూ ఉండాలని సూచించారు.