- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేటి నుంచి నేషనల్ మెడికల్ కమిషన్ అమల్లోకి
దిశ, న్యూస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్ సెప్టెంబరు 25 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇంతకాలం భారత వైద్య మండలి (ఇండియన్ మెడికల్ కౌన్సిల్ -ఎంసీఐ) అమల్లో ఉండగా ఇకపైన అది నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)గా పనిచేయనుంది. పాత ఎంసీఐ పాలకమండళ్ళన్నీ రద్దయ్యాయి. ఎన్ఎంసీ కింద కొత్త గవర్నరింగ్ బాడీ (స్వయంప్రతిపత్తి)లు ఏర్పాటయ్యాయి.
ఎన్ఎంసీ ప్రకారం ఇకపైన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు, పోస్టు-గ్రాడ్యుయేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు, మెడికల్ ఎసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు, ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు అనే నాలుగు విభాగాలు స్వత్రంత అధికారాలతో పనిచేయనున్నాయి. ఒక్కో బోర్డులో అధ్యక్షులతో పాటు ఇద్దరు శాశ్వత సభ్యులు, మరికొంతమంది సభ్యులు, కొద్దిమంది పార్ట్-టైమ్ సభ్యులు ఉంటారు. శాశ్వత సభ్యుల పదవీకాలం నాలుగేళ్ళు, పార్ట్-టైమ్ సభ్యుల పదవీకాలం రెండేళ్ళు ఉంటుంది. నాలుగు బోర్డుల్లో ఒక చైర్మన్, ఇద్దరు శాశ్వత సభ్యులు, మరో ఇద్దరు పార్ట్-టైమ్ సభ్యుల చొప్పున ఉంటారు.