ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద బాంబు పేలుడు కేసు.. దూకుడు పెంచిన NIA

by Anukaran |
ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద బాంబు పేలుడు కేసు.. దూకుడు పెంచిన NIA
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు సంభవించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దూకుడు పెంచింది. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 29న ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు విషయంలో NIA అధికారులు కార్గిల్‌కు చెందిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపినట్లు సమాచారం.

కాగా, జనవరి 29న జరిగిన ఢిల్లీ ఘటనలో గుర్తు తెలియని వ్యక్తులు పేలుడు సంభవించేందుకు అమోనియం నైట్రేట్‌ను వినియోగించిన విషయం తెలిసిందే. అయితే, దీనికన్నా పవర్ ఫుల్ ఆర్దీఎక్స్‌ను వినియోగించి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదని అధికారులు భావించారు. కాగా, గత కొంతకాలంగా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌కు గట్టి మెసేజ్‌ను పంపేందుకు ఇరాన్ జరిపిన కుట్రలో ఇది భాగం కావచ్చునని ఢిల్లీ పోలీసులు ఓ నిర్దారణకు వచ్చారు. పేలుడు సమయంలో పోలీసులకు ఓ లేఖతో పాటు, సగం కాలిన పింక్ స్కార్ఫ్ కూడా లభించింది. ఈ లేఖలో ఇది ట్రైలర్ మాత్రమే అని రాసి ఉన్నట్టు పోలీసు వర్గాలు గుర్తించాయి.

Advertisement

Next Story

Most Viewed