హైవేపై ఆపద వస్తే… ఇలా చేయండి

by Anukaran |   ( Updated:2021-03-29 02:30:28.0  )
హైవేపై ఆపద వస్తే… ఇలా చేయండి
X

దిశ, వెబ్ డెస్క్: రహదారులు.. రక్తమోడుతున్నాయి. రోడ్డు మీదకు వెళ్లాలంటే గుండెలను అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళినప్పుడు, సడెన్ గా రోడ్డు మీద బైక్ ఆగినప్పుడు, ఎవరైనా మనల్ని ఫాలో అవుతున్నప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితి. ఫోన్ చేయడానికి సిగ్నల్స్ లేవు. అలాంటి సమయాల్లో ఏం చేయాలి? ఎలా ఆపద నుండి బయటపడాలి? ఇలాంటి వాటికి చెక్ పెడుతుంది ప్రభుత్వం. ఆపద సమయంలో ఆదుకోవడానికి జాతీయ రహదారులపై వెలసినవే ఎస్ఓఎస్(SOS) బాక్స్ లు. ఇవెప్పుడు పెట్టారు? మేమెప్పుడూ రోడ్డుమీద ఇలాంటి బాక్సులను చూడలేదే? అనుకుంటున్నారా? అయితే ఒకసారి గమనించండి.

జాతీయ రహదారిపై వెళ్తున్నప్పుడు ప్రతి 200 మీటర్లకు ఒక పోల్ ఉంటుంది. దాని మధ్యలో ఒక బాక్స్ లా ఉంటుంది. పైకి అది ఒక కరెంట్ పోల్ లా, మరింకేదైనా టెలిఫోన్ పోల్ లా కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూస్తే ఆ పోల్ మధ్యలో ఒక బాక్స్.. ఆ బాక్స్ కు ఒక రెండు స్విచ్స్ ఉంటాయి. ఎవరైనా ఆపద లో ఉన్నప్పుడు ఆ పోల్ వద్దకు వెళ్లి గ్రీన్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే… అందులో ఉన్న ఆటోమేటిక్ అలారం మోగి ఎమర్జెన్సీ 112 కి కాల్ వెళ్తుంది. అప్పుడు మీకు వచ్చిన ఆపదను తెలియజేయవచ్చు. అంతేకాకుండా వెంటనే మీ లొకేషన్ పోలీసులకు, అంబులెన్స్ కి సమాచారం అందుతుంది. ఈ బాక్స్ లను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. వీటి వలన రోడ్ల మీద వచ్చే అనుకోని ప్రమాదాల నుండి బయటపడవచ్చు.

Advertisement

Next Story

Most Viewed