ఇండియాలో కొత్తగా 29,689 కేసులు

by vinod kumar |   ( Updated:2021-07-27 02:36:23.0  )
corona, india
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 29,689 కొవిడ్ కేసులు నమోదవ్వగా 415 మంది వైరస్ బారిన పడి మృతి చెందినట్లు వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

132 రోజుల తర్వాత తొలిసారి దేశంలో 30 వేలకు లోబడి కరోనా కేసులు వెలుగుచూసినట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో 3,98,100 యాక్టివ్ కేసులుండగా.. 124 రోజుల తర్వాత 4 లక్షలకు లోబడి యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా చూసుకుంటే దేశంలో 3,14,40,951 కరోనా కేసులు ఇప్పటివరకు నమోదవ్వగా.. మరణాల సంఖ్య 4,21,382కు చేరుకుంది.

Advertisement

Next Story