ఆ ప్రాజెక్టును పరిశీలించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బృందం

by Shyam |
ఆ ప్రాజెక్టును పరిశీలించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బృందం
X

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ముప్పు కలుగుతుందని.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందం గురువారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించింది. 12 మంది సభ్యులతో కూడిన ఈ బృందం రెండు విభాగాలుగా ఏర్పడి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించింది. ఒక బృందం నాగర్ కర్నూల్ జిల్లా నార్లాపూర్, మరో బృందం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లను పరిశీలించింది. సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి వివరాలు సేకరించిన బృందం.. ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించారు. వివరాలను సేకరించి గ్రీన్ ట్రిబ్యునల్‌కు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావుతో పాటు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ఎస్ఈ -1 నర్సింగరావు, ఎస్ఈ-2 శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed