67వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వాయిదా?

by Shyam |   ( Updated:2020-04-25 03:20:02.0  )
67వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వాయిదా?
X

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలను దెబ్బ తీసింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీని ఏం చేయాలో తెలియని స్థితిలో పడేసింది. భారీ బడ్జెట్ సినిమాల విడుదల వాయిదా పడగా…. ఎప్పుడు? ఎలా? రిలీజ్ చేయాలో తెలియక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఇక నటులు ప్రాజెక్టులకు ఎలా డేట్స్ సర్దుబాటు చేసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. కరోనా కారణంగా పలు అవార్డుల ప్రధానోత్సవాలు కూడా వాయిదా పడుతూ వచ్చాయి. ఈ క్రమంలో 67వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం కూడా వాయిదా పడనుందట. ప్రతీ ఏడాది మే 3న ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. కానీ ఇప్పుడు అది జరిగే పరిస్థితి లేదనే సమాచారం.

దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడం పై చర్యలు తీసుకుంటున్నందున… నేషనల్ అవార్డుల ప్రదానోత్సవం పై దృష్టి పెట్టలేదని తెలిపారు గతంలో జ్యూరీ మెంబర్ గా ఉన్న చిత్ర నిర్మాత రాహుల్ రావైల్. ఇంకా జ్యూరీ కూడా ఏర్పాటు కాలేదని తెలిపాడు. నిర్మాతలు, సినీ ప్రముఖులతో కూడిన జ్యూరీ ప్రతీ ఏడాది విజేతలను నిర్ణయించి… ఏప్రిల్ లో ప్రకటిస్తారని తెలిపాడు. మే 3న అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందన్నారు. కానీ ఇప్పటి వరకు జ్యూరీ మెంబెర్స్ కూడా సెలెక్ట్ కాలేదని చెప్పాడు.

కాగా… 2019 లో ఎన్నికల కారణంగా మేలో జరగాల్సిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం డిసెంబర్ లో జరిగింది. ఆగస్ట్ లో విన్నర్స్ ప్రకటన జరిగింది. అయితే 2020లో సినిమాలు విడుదల కాకపోయినా వచ్చే ఏడాది నేషనల్ అవార్డులు ఇవ్వడం సరైంది కాదన్నారు రాహుల్ రావైల్.

Tags : National Film Awards -2020, Movies, Corona, CoronaVirus, Covid 19

Advertisement

Next Story

Most Viewed