దేశంలో ‘నేషనల్ ఎమర్జెన్సీ’ లాంటి పరిస్థితులు : సుప్రీంకోర్టు

by Shamantha N |   ( Updated:2021-04-22 04:57:40.0  )
supreme court
X

న్యూఢిల్లీ : దేశంలో ‘నేషనల్ ఎమర్జెన్సీ’ లాంటి పరిస్థితులు తలెత్తాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో కొవిడ్ సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తుండగా.. ఆక్సిజన్, వ్యాక్సిన్, ఔషధాల కొరతతో దేశం అల్లాడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన ఆక్సిజన్, మెడిసిన్‌ (రెమిడెసివిర్) ను సప్లై చేయాలని ఆదేశించింది. దీనిపై తాము నేషనల్ ప్లాన్‌ను కోరుకుంటున్నామని తెలిపింది. ఆక్సిజన్, వ్యాక్సిన్ల కొరతపై ఇప్పటికే దేశంలోని ఆరు రాష్ట్రాల హైకోర్టులు పలు పిటిషన్లను విచారిస్తున్న వేళ సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించింది.

విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఆక్సిజన్ సరఫరా, కరోనా చికిత్సకు వాడుతున్న ఔషధాల సరఫరా, వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి మేం తెలుసుకోవాలనుకుంటున్నాం’ అని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. కొవిడ్‌ను ఎదుర్కోవడానికి కేంద్రం ఏ విధంగా సిద్దమైందని, అందుకు సంబంధించిన ప్రణాళికను తమ ఎదుట ఉంచాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ రేపు జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed