వేక్ సొసైటీ సేవా సంస్థకు జాతీయ విశిష్ట సేవ పురస్కారం

by Shyam |
Wake Society
X

దిశ, వెబ్‌డెస్క్ : వేక్ సొసైటీ సేవా సంస్థను మరో అవార్డు వరించింది. సామాజిక సేవ చేస్తూ జిల్లా ప్రజల మన్ననాలు పొందిన ఆ సంస్థ సేవలను గుర్తించిన హోప్ స్వచ్ఛంద సేవాసమితి, సింధు ఆర్ట్స్ అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి, పద్మభూషణ్ గుర్రం జాషువా 126వ జయంతి పురస్కరించుకొని జాతీయ విశిష్ట సేవా పురస్కారాన్ని అందించి సత్కరించింది. ఈ అవార్డును సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న చేతుల మీదుగా వేక్ సొసైటీ సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపురపు గణేష్ అందుకున్నారు.

ఈ సందర్భంగా గంగవరపు గణేష్ మాట్లాడుతూ.. వేక్ స్వచ్ఛంద సంస్థ అంటరానితనం, కుల నిర్మూలన, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలపై పోరాటం చేస్తుందన్నారు. అలాగే బాల కార్మికులను బడికి పంపించడం, పర్యావరణం, ఎయిడ్స్, కరోనా వంటి రోగాలపై ప్రజలను చైతన్యం కల్పిస్తున్నామని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో మాస్కులు ,శానిటైజర్ల పంపిణీ, కరోనా పేషెంట్లకు అన్నదానం, తదితర సేవ కార్యక్రమాలు చేపట్టినందుకు వేక్ స్వచ్ఛంద సంస్థకు అవార్డు లభించినట్టు గంగపురపు గణేష్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed