- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇది కలా? నిజమా ? – నటరాజన్
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమ్ ఇండియాకు తొలిసారి ప్రాతినిధ్యం వహించిన నటరాజన్ అంచనాలకు మించి రాణించడంతో ప్రశంసల వర్షం కురుస్తున్నది. అనుకోకుండా వచ్చిన అవకాశాలతో తనను తాను నిరూపించుకోవడంతో టీమ్ ఇండియాకు మరో బౌలర్ దొరికాడని అందరూ పొగుడుతున్నారు. కాగా, తన విజయాలపై చివరి టీ20 ముగిసిన తర్వాత నటరాజన్ సోనీ సిక్స్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పలు విషయాలు చెప్పాడు. ‘గత కొన్ని నెలలుగా నా క్రికెట్ కెరీర్‌లో జరగుతున్న విషయాలను అసలు నమ్మలేకపోతున్నాను. కేవలం నెట్ బౌలర్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన తాను ఏకంగా జాతీయ జట్టులో స్థానం సంపాదించుకొని వికెట్లు తీయడం ఆనందంగా ఉన్నది. నేను ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింట గెలవడం.. పైగా టీ20 సిరీస్ కూడా నెగ్గడం సంతోషం కలిగిస్తున్నది. నాకు అండగా ఉన్న జట్టుకు, నా గురువుకు ధన్యవాదాలు’ అని చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో నటరాజన్ 6 వికెట్లు తీశాడు. నటరాజన్ ప్రతిభకు ఫిదా అయిన హార్దిక్ పాండ్యా తన మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ట్రోఫీని నటరాజన్ చేతిలో పెట్టిన విషయం తెలిసిందే.