- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నటరాజన్ అద్భుత ప్రస్థానం
దిశ, స్పోర్ట్స్ : టి. నటరాజన్.. మొన్నటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆటగాడిగానే అందరికీ తెలుసు. కానీ తాజాగా టీమ్ ఇండియా వన్డే జట్టులో స్థానం దక్కించుకొని తొలి వన్డేలోనే రెండు వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. తమిళనాడులోని సేలమ్‌లో పుట్టిన టి. నటరాజన్ తొలుత స్థానిక లీగ్‌తోనే వెలుగులోకి వచ్చాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో బౌలర్‌గా రాణించడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. పంజాబ్ జట్టు అతడిని వేలంలో కొనుక్కున్నా ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. ఆ తర్వాత సన్ రైజర్స్ జట్టు అతడిని గత వేలంలో దక్కించుకుంది.
జట్టులో చేరిన తొలి ఏడాదే అతడిని జట్టులో బౌలర్‌గా ఎంచుకుంది. యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరపున అద్బుతంగా రాణించిన నటరాజన్ ఏకంగా ఆస్ట్రేలియా పర్యటనకు రిజర్వ్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా టీ20 నుంచి తప్పుకోవడంతో ఆ జట్టులో ఎన్నికయ్యాడు. ఇక వన్డేల్లో నవదీప్ సైనీ గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో శార్థుల్ ఠాకూర్‌తో పాటు మరో బౌలర్‌గా నటరాజన్ తుది జట్టులో చేరాడు. కాన్‌బెర్రాలో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రాతో పాటు కొత్త బంతితో బౌలింగ్ చేసిన నటరాజన్.. తొలి వికెట్ తీయడం గమనార్హం.