మే 27న నాసా, స్పేస్‌ఎక్స్ మొదటి ప్రయాణం

by Harish |
మే 27న నాసా, స్పేస్‌ఎక్స్ మొదటి ప్రయాణం
X

దిశ, వెబ్‌డెస్క్: స్పేస్‌ఎక్స్‌తో కలిసి తమ మొదటి వ్యోమగాముల ప్రయాణాన్ని మే 27న ఆవిష్కరించబోతున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. 2011 తర్వాత అమెరికా గడ్డ మీద జరుగుతున్న మొదటి అంతరిక్ష ప్రయాణం ఇది. అలాగే స్పేస్‌ఎక్స్ ద్వారా సాగబోయే మొదటి వ్యోమగాముల మిషన్ కూడా. ఇప్పటివరకు స్పేస్‌ఎక్స్ కేవలం కార్గోను మాత్రమే అంతరిక్షానికి పంపించింది.

ఈ క్రూ డ్రాగన్ డెమో 2 విజయవంతమైతే ఇదే సిరీస్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఈ క్రూ డ్రాగన్ ప్రయాణాలు వరస కడతాయి. దీనికి సంబంధించి నాసా ఇప్పటికే వ్యోమగాముల ఎంపిక వంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ ప్రయోగం మే 7న జరగాల్సి ఉంది, కానీ కరోనా వైరస్ పాండమిక్ కారణంగా వాయిదా పడింది. ఫ్లోరిడాలోని నాసా వారి కెన్నడీ స్పేస్ సెంటర్‌లో లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ వ్యోమనౌకను పంపించనున్నారు. ఇందులో బాబ్ బెహెంకెన్, డాగ్ హుర్లే వ్యోమగాములు ఐఎస్ఎస్ చేరుకోనున్నారు.

Tags – SpaceX, Falcon, NASA, Crew Dragon Demo, Corona, Elon Musk, ISS

Advertisement

Next Story

Most Viewed