- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న నాసా ఉద్యోగులు
దిశ, వెబ్‌డెస్క్:
అంతరిక్షంలో అత్యంత ఖరీదైన వస్తువును భూమ్మీది నుంచి నడిపించే నాసా ఉద్యోగులు ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా ఇంటి నుంచి ఆ పని చేస్తున్నారు. ముఖ్యంగా క్యూరియాసిటీ టీం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్‌ని బాగా ఆస్వాదిస్తోంది. వందల మంది ఉన్న ఈ టీంలో ఒకరిని ఒకరు ప్రత్యక్షంగా కలుసుకోకుండా ఇలా ఇంటి నుంచి పనులు చక్కబెట్టడాన్ని నాసా తన బ్లాగులో పొగిడింది.
సాధారణంగా తామందరూ ఒకే గదిలో స్క్రీన్లు షేర్ చేసుకుంటూ పని చేసుకునేవాళ్లమని టీం లీడ్ అలీసియా అల్బాగ్ తెలిపారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోం వల్ల తాను దాదాపు 16 చాటింగ్ గ్రూపులను ఒకేసారి మేనేజ్ చేయాల్సి వస్తోందని, అసలు పని కంటే ఇదే పెద్ద పనిగా మారిందని అన్నారు. అత్యుత్తమ పనితీరు కనబరిచే వర్క్ స్టేషన్లన్నీ ఇప్పుడు ఆన్‌లైన్ మీద ఆధారపడటంతో వీడియోకాల్స్ అవసరం ఎక్కువవుతోందని చెప్పారు. నాసాలో జెట్ ప్రొపల్షన్ ల్యాబ్, రాకెట్ మెయింటైన్ ల్యాబ్‌లు పూర్తిగా పని అవసరం లేకున్నప్పటికీ క్యూరియసిటీ రోవర్ మాత్రం పని చేయాల్సిన అవసరం ఉందని అల్బాగ్ అన్నారు. ప్రస్తుతం రోవర్ ఒక రాయిని తవ్వి దాని శాంపిల్స్ పంపించే పనిలో ఉందని, అది సాధారణంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతోందని ఆమె వివరించారు.
Tags: NASA, Curiosity, Jet Propulsion, Work from home, lockdown, corona, Covid 19