ముఖాన్ని తాకకుండా హెచ్చరించే ‘నాసా నెక్లెస్’

by Harish |
ముఖాన్ని తాకకుండా హెచ్చరించే ‘నాసా నెక్లెస్’
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య అప్పుడే కోటి దాటి పోయింది. కేసుల పరంగా చూస్తే.. దాదాపు మహా నగరాల్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. వైరస్ నగరాలను దాటి పల్లెల్లోకి వస్తే మాత్రం పరిస్థితులు చాలా భయానకంగా ఉండనున్నాయి. ఈ తరుణంలో మాస్క్ ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడంతో పాటు శానిటైజర్ వాడకమే మనకు శ్రీరామ రక్ష అన్నది తెలిసిందే. ఇవేకాక చేతులతో ముఖాన్ని తాకకుండా జాగ్రత్తపడాలి. అయితే.. మిగతావన్నీ పాటించవచ్చు గానీ.. ముఖాన్ని మన ప్రమేయం లేకుండానే పదే పదే తాకుతుంటాం. దాన్ని మాత్రం నియంత్రించలేకపోతాం. దీనికోసం నాసా శాస్ర్తవేత్తలు సరికొత్త పరిష్కారాన్ని ఆవిష్కరించారు.

ముఖాన్ని చేతితో తాకకుండా హెచ్చరిచ్చేందుకు నాసా ఓ నెక్లెస్‌ను రూపొందించింది. దీనికి ‘పల్స్’ అని పేరు పెట్టింది నాసా. ఇన్‌ఫ్రారెడ్ ప్రాక్జిమిటీ సెన్సార్ సాయంతో చేయి మన ముఖం దగ్గరకు వస్తుందనగానే ఈ నెక్లెస్ అలర్ట్ చేస్తుంది. వెంటనే వైబ్రేట్ అయ్యి మనల్ని హెచ్చరిస్తుంది. 3డీ ప్రింటెడ్ భాగాలతో తయారయ్యే ఈ నెక్లెస్ బ్లూప్రింట్‌ను నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ విడుదల చేసింది. 12 ఇంచుల రేంజ్‌లో ఈ సెన్సార్ పనిచేస్తుంది. మన చిన్(గదవ)కు 6 ఇంచుల దూరంలో ఇది ఉంటుంది. అంతేకాదు ఇది ఎవరైనా తయారు చేసుకోవచ్చని నాసా వెల్లడించింది. దీన్ని తయారు చేయడానికి కావాల్సిన విడి భాగాలను, 3డీ మోడల్, ప్రింటింగ్ ఫైల్స్, అసెంబుల్ ఇనస్ట్రక్షన్స్‌తో పాటు ఓపెస్ సోర్స్‌ లైసెన్స్‌ను అందుబాటులో ఉంచింది. ‘పల్స్’ను రీప్రొడ్యూస్ చేయొచ్చు, రీఫైన్ కూడా చేసుకోవచ్చని నాసా వెల్లడించింది. ఓపెన్‌గా డిస్ట్రిబ్యూట్ కూడా చేసుకోవచ్చని, ప్రజల ఆరోగ్యమే తమ ప్రాధాన్యమని నాసా వెల్లడించింది.

లిస్ట్ ఆఫ్ పార్ట్స్ :

ప్రాక్సిమిటి సెన్సార్ (12 ఇంచ్ రేంజ్ )
కాయిన్ వైబ్రేటర్ మోటార్
టాక్టిల్ స్లైడ్ స్విచ్
3వీ బ్యాటరీ

Advertisement

Next Story