హాట్ టాపిక్‌గా ‘హెపా’ మాస్క్

by Shamantha N |
హాట్ టాపిక్‌గా ‘హెపా’ మాస్క్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే ఓ ఎంపీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు, పూణె వర్శిటీ మాజీ వైస్ చాన్స్‌లర్, ప్రస్తుత రాజ్యసభ (కాంగ్రెస్) సభ్యుడైన డాక్టర్ నరేంద్ర జాదవ్ హెపా (హై ఎఫిషియన్సీ పర్టిక్యులేట్ ఎయిర్) మాస్కును ధరించి పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆలోచన మేరకు నిపుణులతో సంప్రదింపులు జరిపి 99.7% మేర స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందించేలా ఈ మాస్కుకు రూపకల్పన చేశారు. ఎన్-95 మాస్కుతో పోలిస్తే 166 రెట్లు సురక్షితమైనది. పాజిటివ్ ప్రెజర్ టర్బైన్ ఉండడం వల్ల ఇది సాధ్యమవుతుందని కొండా వివరించారు. కేవలం నరేంద్ర జాదవ్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దీన్ని తయారుచేయించినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed