- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘డ్రగ్ డీలర్ అరెస్ట్‌కు అడొచ్చాడు’
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో డ్రగ్ డీలర్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి, డ్రగ్ డీలర్‌తో చాటింగ్ చేసిన ఆధారాలు బయటపడ్డాయి. సుశాంత్ కేసులో డ్రగ్స్ వ్యవహారం వెలుగుచూడడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ జరుపుతోంది. దీంతో ఈ రోజు డ్రగ్ డీలర్ కైజన్ ఇబ్రహీంను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే, ఇబ్రహీంను అధికారులు వాహనంలో ఎక్కించి తీసుకెళ్తున్న సమయంలో అతడి తరఫు న్యాయవాది అడ్డుతగిలాడు. తీసుకెళ్లేందుకు వీల్లేదు అంటూ వాగ్వాదానికి దిగాడు. డ్రగ్స్ సరఫరా కేసులో ఇబ్రహీంకు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించినా.. ఆ తర్వాత ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో, కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా ఎలా అదుపులోకి తీసుకుంటున్నారని కైజర్ తరఫు న్యాయవాది అధికారులతో వాదనకు దిగారు.