ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి.. కలెక్టర్ సూచన

by Shyam |
Narayanpet Collector Harichandana
X

దిశ, మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ను, స్థానిక మాద్వార్ గ్రామంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను నారాయణ పేట జిల్లా కలెక్టర్ హరిచందన ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని, దళారులకు అమ్మి నష్టపోకూడదని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తేమశాతానికి మినహాయింపు ఇవ్వాలని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, తేమ శాతానికి మినహాయింపు లేదని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ స్థలాల్లో ఎండబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని సూచించారు.

‘‘మక్తల్ వ్యవసాయ మార్కెట్‌కు ఇప్పటివరకు 30 వేల గన్నీ బ్యాగులు వచ్చాయి. 21 మంది రైతులకు టోకెన్లు ఇచ్చాము. అందులో కొంతమంది మాత్రమే కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చారు. అందులో 8 మంది రైతులకు వారి అకౌంట్‌లో డబ్బులు చెల్లించాము.’’ అని మక్తల్ వ్వయసాయ మార్కెట్ చైర్మన్ రాజేష్ గౌడ్ కలెక్టర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి బాలమణి, వ్యవసాయ అధికారి మిథున్ చక్రవర్తి, జిల్లా ఎస్పీ చేతన, సీఐ శంకర్, ఎస్ఐ రాములు, మక్తల్ తహసీల్దార్ మజర్, తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed