రమ్య హత్య కేసును రాద్దాంతం చేయొద్దు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

by srinivas |
రమ్య హత్య కేసును రాద్దాంతం చేయొద్దు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
X

దిశ, ఏపీ బ్యూరో: బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసును టీడీపీ రాద్దాంతం చేయడం తగదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రమ్య హత్య కేసులో టీడీపీ రాజకీయ రాద్దాంతం మానుకోవాలని హితవు పలికారు. ఎస్సీలకు ఏదో జరిగిపోయిందని చంద్రబాబు, టీడీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎప్పుడైనా ఎస్సీలను ఆదరించిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజకీయ సమానత్వం కల్పించింది వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. రమ్య హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేశారని..అలాగే బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించామని తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని..నిందితుడికి ఉరిశిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని నారాయణస్వామి స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed