- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బాలు పాటలు చిరకాలం జీవించే ఉంటాయి’
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నేపథ్య గాయకుడిగా, నటుడిగా దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి నాలా లోకేష్ తీవ్ర దింగ్భ్రాంతికి గురయ్యారు. అనేక భాషల్లో పాటలు పాడి అన్ని భాషల ప్రజల్లోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.
‘ఆబాల గోపాలాన్ని తన గానంతో అలరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూయడం.. సంగీత, సాహిత్య, సినీ, కళా ప్రపంచానికి తీరనిలోటు. దశాబ్దాలుగా భారతీయ భాషలన్నింటిలోనూ 40 వేలకు పైగా పాటలు పాడిన సుస్వరాల సుమధుర బాలు మనమధ్య లేకపోవచ్చు. ఆయన పాట, మాట, బాట, నటన, సంగీతం అన్నీ చిరకాలం జీవించే ఉంటాయి. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబానికి, అశేషాభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’ అని నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.