- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్ మరణాలపై తప్పుడు లెక్కలు.. ఆరోగ్యశ్రీ మాటలకే పరిమితం : నారా లోకేష్
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసుల విజృంభణ తీవ్రస్థాయికి చేరింది. గతంలో నమోదైన కేసుల స్థాయికి ప్రస్తుత పాజిటివ్ కేసుల సంఖ్య చేరుతోంది. ఒక్కరోజులోనే పదకొండు వేలకు పైగా కేసులు నమోదవుతుండటం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. అయితే, రాష్ట్రంలో నమోదయ్యే కరోనా మరణాలపై మాజీ మంత్రి, టీడీపీ నేత నారాలోకేష్ స్పందించారు. ప్రభుత్వం విడుదల చేసే హెల్త్ బులెటిన్ మరణాలకు వాస్తవానికి చాలా తేడా ఉందన్నారు. కొవిడ్ మరణాలపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపించారు. గడచిన 24గంటల్లో విశాఖ జిల్లాలో ఇద్దరే చనిపోయారని వెల్లడించారని.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు.
గతంలో కరోనాను ఆరోగ్య శ్రీలో చేరుస్తామని ఇచ్చిన వాగ్దానం ఏమయ్యిందని ప్రశ్నించారు. పది పరీక్షల వలన కూడా కరోనా విస్తరించే అవకాశం ఉందన్నారు. ఏపీలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై మరోసారి సమీక్షించుకోవాలని, పక్క రాష్ట్రం తెలంగాణ 10 పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నారా లోకేష్ గుర్తుచేశారు. పరీక్షల నిర్వహణపై మరోసారి ఆలోచించాలని ప్రభుత్వానికి లేఖ రాస్తే స్పందన కరువైందని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని నారా లోకేష్ హెచ్చరించారు.