వైసీపీ వంద తప్పులు పూర్తయ్యాయి: నారా రోహిత్

by srinivas |
Nara rohit
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు చేసుకుంటున్న ఆరోపణలు, విమర్శలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఆంధ్రా అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు.. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు కుటుంబ సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ప్రముఖ నటుడు నారా రోహిత్‌ స్పందించారు. అసెంబ్లీ చర్చల్లో కుటుంబ సభ్యుల ప్రస్తావన తీసుకొచ్చి అసభ్యంగా మాట్లాడటం క్షమార్హం కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

శిశుపాలుడి వంద తప్పులు పూర్తైనట్లు, నిన్నటితో వైకాపా వంద తప్పులు పూర్తయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న విషయాన్ని ఈ వికృత క్రీడల వెనుక సూత్రధారి గుర్తుపెట్టుకోవాలని హితువు పలికారు. ప్రతి ఒక్క తెలుగుదేశం సైనికుడు వైసీపీ దుశ్శాసనుల భరతం పడతారని ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు సతీమణి, నారా భువనేశ్వరిని అసభ్య పదజాలంతో దూషించటం దిగ్భ్రాంతికరమని విచారం వ్యక్తం చేశారు.

వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి, చంద్రబాబు గారిని నైతిక స్థైరాన్ని దెబ్బతీయాలనుకుంటే, అది మీ భ్రమే అవుతుందని కౌంటర్‌ వేశారు. స్థాయి లేని వ్యక్తుల మధ్యలో మీరు రాజకీయం చేయాల్సి రావటం దురదృష్టకరం పెదనాన్న.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. మేమంతా మీ వెంటే ఉంటాం అంటూ చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed