- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టీల్ ప్లాంట్ ను కొట్టేసేందుకు జగన్ కుట్ర : లోకేష్
దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం అమ్మేస్తుంటే సీఎం వైఎస్ జగన్ కొనుగోలు చేస్తున్నారంటూ టీడీపీ నేత నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన లోకేష్ వైసీపీ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రగల్భాలు పలికే ఈ ఎంపీలు అంతా ఢిల్లీలో ఒకే సార్ అంటూ గంగిరెద్దుల్లా తల ఆడిస్తారని విమర్శించారు. తల ఆడించడానికి 28 మంది ఎంపీలు ఎందుకు దండగ అని మండిపడ్డారు. ప్రజల హక్కులు కాపాడలేని వారు ఎంతమంది ఉంటే ఏమి అంటూ అసహనం వ్యక్తం చేశారు.
విశాఖ ఉక్కుని తుక్కులా కొట్టేయడానికి జగన్ ఎన్నికుట్రలు చేసినా వాటిని భగ్నం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తామని లోకేష్ వెల్లడించారు. అన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పే చేస్తున్నాం.. జగన్ అంగీకారంతోనే విశాఖ ఉక్కు అమ్మకం ప్రక్రియ జరుగుతోందని కేంద్రం స్పష్టం చేసిందని చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పేరు చెప్పి జగన్‌రెడ్డి లేఖలతో కాలక్షేపం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా వైసీపీ నాయకుల డ్రామాలు ఆపి ఢిల్లీలో కొట్లాడాలని లోకేష్ హితవు పలికారు.