మా పచ్చజెండాను చూసి జగన్ గజగజ వణికిపోతున్నారు : లోకేష్

by Anukaran |
మా పచ్చజెండాను చూసి జగన్ గజగజ వణికిపోతున్నారు : లోకేష్
X

దిశ,వెబ్‌డెస్క్: పచ్చ జెండాను చూసి వైసీపీ నేతలు వణికిపోతున్నారని, సీఎం జగన్ గన్ లో బుల్లెట్లు లేవని నారాలోకేష్ కామెంట్ చేస్తే ఆయనకు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు అంబటి రాంబాబు. “రాష్ట్రం అంతా చూస్తున్నాం. వైసీపీ నేతలకు పసుపు జెండా చూస్తుంటేనే ఉచ్చపడుతున్నాయి. జగన్ పిరికోడు కాదా అని అడుగుతున్నాను. కాదని చెప్పమనండి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయట కాలు పెట్టడానికే బయపడుతున్నారు. ఈయనని చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. ఇది బుల్లెట్ ఉన్న గన్నని చెప్పమనండి. అది ఎక్కడ కాలిందో చెప్పమనండి ” అంటూ నారా లేకేష్.., సీఎం జగన్ పై కామెంట్ చేశారు. నారా లోకేష్ కామెంట్స్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాం బాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ గన్నులో బుల్లెట్లు లేకుండానే తుస్సుమన్నావా? జగన్ లో బుల్లెట్లు లేకపోతే కుప్పంలో 14పంచాయతీలకు పరిమితమయ్యావా? అని సెటైర్లు వేశారు. అంతేకాదు నారా లోకేష్ ను మంచి వైద్యుడికి చూపించాలని నారా భువనేశ్వరిని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కోరారు

Advertisement

Next Story