ఇలాంటి కష్టం పగోడికి కూడా రాకూడదు : లోకేశ్

by srinivas |
ఇలాంటి కష్టం పగోడికి కూడా రాకూడదు : లోకేశ్
X

దిశ, ఏపీబ్యూరో :
కరోనాకు చికిత్సపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేశ్ ట్విట్టర్ మాధ్యమంగా ప్రశ్నించారు. ఓ వీడియోను పోస్టు చేస్తూ.. ‘అవసరానికి మించి బెడ్లు ఏర్పాటు చేశామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అంటున్నారు. మరోవైపు బెడ్లు లేవని మమ్మల్ని రోడ్ల మీదే వదిలేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొవిడ్ బాధితులు’ అంటూ మండిపడ్డారు. మరో ట్వీట్‌లో అనంతపురం జిల్లా మడుగుపల్లి గ్రామానికి చెందిన మన్మథ రెడ్డి తండ్రి కరోనాతో మరణించారు. కుటుంబ సభ్యులకు వైద్యం అందని పరిస్థితి. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఇప్పటికైనా జగన్ రెడ్డి కళ్లు తెరవాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed