జే ట్యాక్స్ వసూళ్లకు పరితపించడం దారుణం: లోకేశ్

by srinivas |   ( Updated:2020-07-25 22:20:33.0  )
జే ట్యాక్స్ వసూళ్లకు పరితపించడం దారుణం: లోకేశ్
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జే ట్యాక్స్ వసూళ్ల కోసం పరితపించడం దారుణమని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ట్విట్టర్ మాధ్యమంగా మద్యం షాపుల వేళలు పెంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నా, క్వారంటైన్‌ కేంద్రాల్లో వసతులు, కనీసం సరైన భోజనం లేదంటూ బాధితులు గగ్గోలు పెడుతున్నారని అన్నారు.

కరోనా కారణంగా రోడ్లపైనే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో జగన్‌ జెటాక్స్‌ వసూళ్ల కోసం పరితపిస్తున్నారని విమర్శించారు. మద్యం దుకాణాలు రాత్రి 9 వరకు తెరిచి ఉంచాలన్న ఆదేశాలు దుర్మార్గమని మండిపడ్డారు. మద్యం దుకాణాలు ఇప్పటికే కరోనా కేంద్రాలుగా మారిపోయాయని విమర్శించిన ఆయన, ధరలు పెంచి మద్యపాన నిషేధం చేస్తున్నామని గొప్పలు చెప్పారని, రాత్రి 9 వరకు పెంచడం కూడా అందులో భాగమేనా అని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed