'సింహా' సినిమా డైలాగులతో సీఐడీని కడిగేసిన నారా లోకేశ్

by  |
సింహా సినిమా డైలాగులతో సీఐడీని కడిగేసిన నారా లోకేశ్
X

దిశ, ఏపీ బ్యూరో: ‘సింహా’ సినిమా గుర్తుందా? అందులో ఫ్లాష్ బ్యాక్‌లో బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగులు చెప్పి ఆకట్టుకుంటాడు. అదే డైలాగ్‌ను టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్ వాడేసుకున్నారు. ట్విట్టర్ మాధ్యమంగా వైఎస్సార్సీపీ తీరును విమర్శిస్తూ.. ‘వైఎస్సార్సీపీ మాఫియా ఇసుక కొట్టేస్తే.. నో సీఐడీ. ఇళ్ల స్థలాలు అమ్మతుంటే…నో సీఐడీ. ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో కోట్లు కొల్లగొడుతుంటే…నో సీఐడీ. విషం కంటే ప్రమాదకరమైన మందు పోస్తూ వేల కోట్లు జే ట్యాక్స్ వసూలు చేస్తుంటే…నో సీఐడీ. 108లో స్కామ్ బయటపడితే…నో సీఐడీ. మైన్స్ మింగేస్తుంటే…నో సీఐడీ’ అంటూ విమర్శించారు.

మరో ట్వీట్‌లో ‘మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడుతుంటే.. నో సీఐడీ. రాజారెడ్డి రాజ్యాంగంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్‌ని సోషల్ మీడియా వేధింపుల డిపార్ట్మెంట్ గా మార్చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛని హరించే హక్కు మీకు ఎవరిచ్చారు?’ అంటూ నిలదీశారు.

ఇంకో ట్వీట్‌లో ‘ఏం నేరం చేశారని అర్థరాత్రి చొరబడి మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు? కృష్ణ, కిశోర్ గారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. జగన్ గారి చెత్త పాలన గురించి వైఎస్సార్సీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలే మీడియా ముఖంగా వివరిస్తున్నారు మరి వారిని కూడా సీఐడీ అరెస్ట్ చేస్తుందా?’ అంటూ ప్రశ్నించారు.


Next Story

Most Viewed