- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించండి: జేడీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు
దిశ, వెబ్ డెస్క్: విశాఖ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విశాఖ ఉత్తరం నుంచి జై భారత్ నేషనల్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తనకు ప్రాణ హాని ఉందని విశాఖ సీపీకి ఫిర్యాదు చేయడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఎన్నికల తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు కొన్ని ఆధారాలను సైతం సీపీకి అందజేశారు. తనకు రక్షణ కల్పించాలని సీపీని జేడీ లక్ష్మీనారాయణ కోరారు.
కాగా గత ఎన్నికల్లో జేడీ లక్ష్మీనారాయణ జనసేన తరపున విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇటీవల జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీకి జేడీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.