అన్నా.. మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తున్నావ్! ఈటలతో మల్లారెడ్డి అలయ్ బలయ్!

by Ramesh N |   ( Updated:2024-04-27 14:39:38.0  )
అన్నా.. మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తున్నావ్!  ఈటలతో మల్లారెడ్డి అలయ్ బలయ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మాజీ మంత్రి బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు. మాల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించబోతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని కండ్లకోయ కేఎస్ఆర్ ఫంక్షన్ హాలులో ఓ వివాహ వేడుకల్లో మల్లారెడ్డి, బీజేపీ మాల్కాజ్‌గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ‘అన్నా.. నువ్వే గెలుస్తున్నావ్’ అంటూ బీజేపీ నేత ఈటలను కౌగిలించుకున్నారు. అన్నతో ఫోటో తీయండి అని అక్కడ ఉన్నవారిని కోరారు. దీంతో అక్కడున్న వారు వారి ఫోటో తీశారు.

మరోవైపు ఇద్దరి నేతలతో కలిసి పలువురు ఫోటోలు దిగారు. ఈ క్రమంలోనే ఇద్దరు నేతలు నవ్వుతూ సరదాగా మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, మల్కాజిగిరి లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి ఈటల గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా గెలస్తారని వ్యాఖ్యనించడంతో మల్కాజ్‌గిరి రాజకీయాలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఇప్పటికే పార్లమెంట్ పరిధిలో ఈటల రాజేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Advertisement

Next Story