- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యార్థి లోకం తిరగబడితే బయటకు అడుగుపెట్టలేవు :లోకేష్
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు వైఎస్ జగన్ అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు నారా లోకేష్. విద్యార్థి లోకం తిరగబడితే నువ్వు తాడేపల్లి కోట నుండి బయటకు అడుగుపెట్టలేవు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేస్తూ జీఓ 77 తీసుకొచ్చారు.
విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేస్తున్న జీఓ77 ని రద్దు చెయ్యమని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపితే.. విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చెయ్యడం దుర్మార్గపు చర్య అని ట్వీట్ చేశారు. అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకొని.. జీఓ77 ని రద్దు చెయ్యాలి. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని పునరుద్ధరించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు @ysjagan. విద్యార్థి లోకం తిరగబడితే నువ్వు తాడేపల్లి కోట నుండి బయటకు అడుగుపెట్టలేవు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేసారు.(1/3) pic.twitter.com/dPt9l232g1
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 23, 2021