- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఏ-1, ఏ-2ల గత చరిత్ర మొత్తం ఇదే’
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కొల్లగొట్టిన కోట్ల కొద్దీ నల్లధనాన్ని వైసీపీ నేతలు.. ఎమ్మెల్యే స్టిక్కర్లు అంటించిన కార్లలో చెన్నైకి చేరవేస్తున్నారన్నది బయటపడిందన్నారు నారా లోకేశ్. ఇలా వెళ్తున్న డబ్బు ఎవరిది? ఆ డబ్బు చెన్నై నుంచి హవాలా మార్గంలో మారిషస్ కు వెళ్ళేది నిజమేనా? ఇవిప్పుడు తేలాల్సింది ఉందని చెప్పారు. చెన్నైలో ఒకే అడ్రస్ తో ఉన్న ఫారెస్ ఇంపెక్స్, క్వన్నా ఎగ్జిమ్, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీలకు వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ భారతీ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డిలు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.
హవాలాకు కేంద్రంగా ఉన్న వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ సంస్థ రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన ఇ-మెయిల్ అడ్రస్ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిదని నారా లోకేశ్ అన్నారు. పైగా ఈ సంస్థను వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019 సెప్టెంబర్ 20న రిజిస్టర్ చేశారు అంటే అది సూట్ కేసు సంస్థ అన్నట్టే కదా అని ఎద్దేవా చేశారు. అక్రమంగా దోచుకోవడం, సూట్ కేసు సంస్థలు పెట్టి వాటిల్లోకి మళ్ళించడం, అక్కడ నుంచి హవాలా మార్గంలో డబ్బును విదేశాలకు తరలించడం… ఏ-1, ఏ-2ల గత చరిత్ర మొత్తం ఇదే అని చెప్పారు. ఇప్పుడూ అదే నడుస్తోందని.. ఈ మొత్తం తతంగంపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రజలకు వాస్తవాలు తెలియాలని టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ చేశారు.