జగన్‌ కారణంగా ఏపీకి దూరమైన ఉద్యోగాలు: నారా లోకేశ్

by srinivas |
naralokesh
X

దిశ, ఏపీబ్యూరో: జగన్ సర్కార్ పై ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి పరిశ్రమలు గుడ్ బై చెప్పడమే కాదు.. కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేందుకు విముఖత చూపుతూ ఇతర రాష్ట్రాల వైపు చూస్తున్నాయని ఆరోపించారు. టాటా గ్రూపు 300 మిలియన్ డాలర్లతో ఏర్పాటు చేయ తలపెట్టిన సెమి కండక్టర్ పరిశ్రమ కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వైపు చూస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే లులూ గ్రూప్ సైతం ఏపీలో అడుగుపెట్టకూడదని నిర్ణయించిందన్నారు. ఏపీకి ఇక జన్మలో వచ్చేది లేదని లులూ సంస్థ తీర్మానించుకుందంటూ లోకేశ్ వెల్లడించారు. చంద్రబాబు హయాంలో విశాఖలో పెట్టుబడిదారులకు ఎంతో ఆకర్షణీయమైన గమ్యస్థానంలా వెలిసిందని.. కానీ జగన్ వచ్చి ఒప్పందాలను రద్దు చేయడంతో 10 వేల ఉద్యోగాలు వెనక్కి వెళ్లిపోయాయని ఆరోపించారు.

‘లులూ గ్రూప్ కానివ్వండి, సింగపూర్ పరిశ్రమల కన్సార్టియం కానివ్వండి, టాటా రెన్యూవబుల్ పవర్, ఆసియా పల్ప్ అండ్ పేపర్ పరిశ్రమలు కానివ్వండి.. జగన్ అతడి ముఠా కారణంగా ఏపీకి దూరమయ్యాయి. ఇక్కడి ప్రజలకు ఉపాధి దూరమైంది. ఏపీ ఇంత దుస్థితిలో చిక్కుకోవడానికి జగనే కారణం’ అని నారా లోకేశ్ విమర్శించారు.

Next Story

Most Viewed