మాన్సాస్ ట్రస్ట్‌లో కుతంత్రాలు: నారా లోకేశ్

by srinivas |
మాన్సాస్ ట్రస్ట్‌లో కుతంత్రాలు: నారా లోకేశ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విమర్శలు చేశారు. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. ఎంతో మందికి విద్య, విజ్ఞానాలు అందించి క‌ళ‌లు, సంస్కృతిని పెంపొందించిన‌ విజ‌య‌న‌గ‌రం పూస‌పాటి వంశీయుల మ‌హారాజ పోష‌ణా సంస్థ మాన్సాస్‌ అంటూ గుర్తు చేశారు. అటువంటి సంస్థని జగన్ స‌ర్కారు త‌మ కుతంత్ర రాజ‌కీయాల‌కు వేదిక చేసుకోవ‌డం విచార‌క‌మన్నారు.

గతంలో ట్ర‌స్ట్ చైర్మ‌న్‌గా ఉన్న అశోక్ గజపతి రాజు పై క‌క్ష తీర్చుకోవ‌డానికి మాన్సాస్ ప‌రిధిలోని భూములు, ఆస్తుల కోసం, ట్ర‌స్ట్‌ని జ‌గ‌న్‌రెడ్డి చెర‌బ‌ట్టారని ఆరోపించారు. మాన్సాస్‌ని అడ్డుపెట్టుకుని క్షుద్ర‌రాజ‌కీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ట్ర‌స్ట్ ప‌రిధిలో దేవాల‌యాలు, విద్యాసంస్థ‌లు లెక్కలేనన్ని ఉన్నాయని లోకేశ్ తెలిపారు.

అశోక్ గ‌జ‌ప‌తిరాజుని చైర్మ‌న్‌గా జ‌గ‌న్‌రెడ్డి తొల‌గించిన నుంచీ ఈ సంస్థ‌ల‌లో ప‌నిచేసే ఉద్యోగులకు జీతాలివ్వ‌డంలేదని లోకేశ్ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే తన ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేశారు. 5 నెల‌లుగా జీతాలివ్వ‌డంలేద‌ని నాన్‌టీచింగ్ స్టాఫ్ విజ‌య‌న‌గ‌రం వీధుల్లో భిక్షాట‌న చేయ‌డం అంద‌రినీ క‌ల‌చివేస్తోంది అంటూ ట్వీట్ చేశారు.

వారు కుటుంబాల‌తో స‌హా రోడ్డున ప‌డటానికి కార‌ణం ముమ్మాటికీ జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారే అంటూ మండిపడ్డారు. భూములు కొట్టేసేందుకు, ప‌ద‌వులు అలంక‌రించేందుకు మాన్సాస్ ట్ర‌స్ట్ కావాలా?.. అందులో ప‌నిచేసే ఉద్యోగుల‌కు మాత్రం జీతాలివ్వ‌రా!.. ఇదేమి న్యాయం అంటూ నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా జగన్‌ను నిలదీశారు.

Advertisement

Next Story

Most Viewed